చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం కృష్ణాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో ముఖ్య నిందితుడు వెంకటరమణ, అలాగే ఐదవ నిందితుడు రెడ్డప్పరెడ్డిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను భయపెట్టేందుకే రామకృష్ణను హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన రెడ్డప్పరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడని వెల్లడించారు. హత్యకు ముందు నిందితుడు వైసీపీ ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. నిందితులు భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని, వారి అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకే రామకృష్ణను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య మార్చి 15న జరిగింది.
![]() |
![]() |