ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: శరద్ పవార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 03:58 PM

ముంబై: లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలో సందడి మొదలైంది. షెడ్యూల్ విడుదలకావడంతో ఎన్ని స్థానాల్లో పోటీచేయాలి? అభ్యర్థులను ఎలా ఖరారు చేయాలి? ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో రాజకీయ కురువృద్ధులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. తమ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు పోటీచేస్తారని వెల్లడించారు. కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగుతున్నారని పవార్ పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీచేయలేదు. ఐతే ఈసారి పోటీచేస్తారని పార్టీనేతలు, కార్యకర్తలు భావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa