ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 04:52 PM

కాకినాడ :  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించాడు. కాకినాడలోని సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. తొలుత వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. సభలో భారీ స్థాయిలో అభిమానులు.. కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల శంఖారావంలో జగన్ మాట్లాడుతూ….అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు.  మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారని అన్నారు. టీడీపీకి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల ముందు యువతకు నిరుద్యోగ భృతి ప్రకటించారన్నారు. వైసీపీకి ఒక్క అవకాశమిచ్చి..ఒక్కసారి అధికారం ఇవ్వండని అడిగారు.చంద్రబాబు పార్టీ ప్రత్యేక హోదాను తాకట్టు  పెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలను వంచించిందన్నారు. గుడి భూములను వదలడం లేదు… పేదల భూములను వదలడం లేదన్నారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాజధాని పేరుతో అడ్డగోలుగా భూమి సేకరించారన్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ కనిపించవన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తారన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు అనేక కష్టాలు పెట్టారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa