ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై ఇటీవల విపరీతంగా చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ ను గెలిపించాల్సిన వ్యక్తి చివర్లో బ్యాటింగ్ కు రావడమేంటని పలువురు క్రీడాభిమానులు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ తాజాగా స్పందించాడు. ధోని చివర్లో బ్యాటింగ్ కు రావడాన్ని విమర్శించాడు. ఈ విషయంలో సీఎస్కే మేనేజ్ మెంట్ కానీ, కోచ్ లు కానీ ధోనికి వాస్తవ పరిస్థితులను చెప్పడంలో వెనుకాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. బహుశా ధోనికి సలహా ఇచ్చేందుకు వారు భయపడి ఉంటారని, అందుకే ముందుగా బ్యాటింగ్ కు వెళ్లాలని చెప్పలేకపోయారని అన్నారు. ఏ స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లాలనే విషయంలో ధోనీ తనకుతానుగా నిర్ణయించుకుంటాడని అన్నాడు. ఒకసారి ధోనీ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇంతకీ ధోనీ గెలవడానికే మ్యాచ్ ఆడుతున్నాడా అని సెటైర్ వేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ధోనీ పునరాలోచించుకోవాలని, మరింత ముందు బ్యాటింగ్ కు దిగాలని తివారీ విజ్ఞప్తి చేశాడు.
![]() |
![]() |