రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. గత నెల 28వ తేదీ నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మరణం బాధాకరమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు సూసైడ్ నోట్ లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం , కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరమని మండిపడ్డారు.
![]() |
![]() |