గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని శాసనసభాపతి కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. మార్చి 22వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకర్లతో మాట్లాడారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామని చెప్పారు. తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇస్తున్నానని తెలిపారు. సత్తెనపల్లిలో 15వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa