ముంబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ (సీఎస్‌టీ) సమీపంలోని ఓ పుట్ ఓవర్ బ్రిడ్జి ఆకస్మాత్తుగా కూలిన సంఘటనలో నలుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. సీఎస్‌టీ ప్లాట్‌పామ్-1కు వెళ్లే పాదాచారుల వంతెన ఒక్కసారిగా రాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa