దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. వినుకొండలో నిర్వహించిన ఎడ్లపందాల పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టసీమతో గోదావరి జలాలు కృష్ణాకు తెచ్చి రాయలసీమ కష్టాలు తీర్చారన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధానంతో ప్రతి ఎకరానికీ నీరందించే ప్రణాళిక రూపొందిస్తున్నామని, రైతుల కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టు పూర్తికి అందరూ మద్దతివ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa