సోషల్ మీడియాలో తనను పాకిస్థానీలు ట్రోల్స్ చేయడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు. తనకంటే అందగాడు వాళ్లకు కనిపించడం లేదేమో.. ‘ఇప్పుడు నేను పాకిస్థాన్‌కు దుల్హే బాయ్ (బావమరిది)’ చమత్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై ఒవైసీ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఆ దేశ నాయకులను తూర్పారబడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు సరైన బుద్దిచెప్పాల్సిందేనని కోరుతున్నారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్, విదేశాలకు వెళ్లే ఏడు ప్రతినిధి బృందాల్లో తనను కేంద్రం ఎంపిక చేయడంపై ఒవైసీ మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రోల్స్‌పై ప్రశ్నించగా, ఆయన పై విధంగా స్పందించారు:
‘పాకిస్థాన్‌కు ఒక్క దుల్హే భాయి ఉంటే అది నేనే... నన్ను మించిన ధైర్యంగా, అందంగా మాట్లాడగలవారెవరూ వారికి కనిపించడం లేదు. వారికి భారత్‌లో కనపించేది నేను మాత్రమే. నన్ను చూడండి.. నా ప్రసంగాలు వినండి మీ జ్ఞానం పెరుగుతుంది. మీ మెదడులో ఉన్న చెడు తొలగిపోతుంది, అజ్ఞానం పోతుంది’ అంటూ నవ్వుతూ స్పందించారు ఒవైసీ.
ప్రధానమంత్రి మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేసే ఒవైసీ.. రాజకీయంగా ఒంటరైన నాయకుడిగా పరిగణిస్తారు. బీజేపీ ఆయనను తీవ్రవాదిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తే.. విపక్షాలు అతడు బీజేపీకి ‘B-టీమ్’ అంటూ ఆరోపిస్తుంటాయి. కానీ, పహల్గామ్ దాడి అనంతరం కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తొలుత ఎంఐఎంను ఆహ్వానించలేదు. అయితే, ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఒవైసీని ఆహ్వానించారు. నెల వ్యవధిలోనే ఒవైసీ అన్ని అఖిలపక్ష సమావేశాలకు హాజరుకావడం నుంచీ, విదేశాల్లో భారత్ వాణిని వినిపించడానికి ఎంపిక కావడం వరకూ తన ప్రాముఖ్యతను పెంచుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పాకిస్థాన్ నాయకులను, వారి ఉగ్రవాద మద్దతు ధోరణిపై హైదరాబాద్ ఎంపీ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ప్రార్థనల ముందు మసీదులో నలుపు రంగు పట్టీలను పంపిణీ చేస్తూ పాక్ నేతల రొచ్చగొట్టే వ్యాఖ్యలను ధీటుగా ఖండించారు. దేశ భద్రత అంశాలలో భారత్‌కు తాను అడంగా నిలుస్తానని స్పష్టం చేస్తూనే, దేశీయ రాజకీయాలపై తన విమర్శలు కొనసాగుతాయని చెప్పారు.
పాక్ నేతల అణ్వాయుధ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పాకిస్థాన్ ఎప్పుడూ అణ్వాయుధ శక్తిగా తమను తాము గొప్పగా చెప్పుకుంటుంది. కానీ అమాయకుల్ని చంపుతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చోబోం... మీరు మతం పేరిట మాప్రజలను లక్ష్యంగా చేసుకుంటే, మీరు చెప్పేది ఏ మతం? ఇది ఐసిస్ తరహా చర్య.’ అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు..‘పాకిస్థాన్ ఒక్క గంట కాదు, అర్ధ శతాబ్దం వెనుక పడిపోయింది’ అని ఎద్దేవా చేశారు.
ఉగ్రవాదంపై ఒవైసీ స్టాండ్.. ఆయనకు విపరీతమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ‘పాకిస్థాన్ ముర్దాబాద్.., హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ గట్టిగా నినదించిన ఆయన వీడియోలు, కఠినమైన హిందుత్వవాదుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాయి. భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రతినిధ్యం వహించబోతున్న సందర్భంలో, ‘ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు. బయలుదేరే ముందు మరొకసారి సమగ్ర సమావేశం ఉంటుంది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన బాధ్యత. నా శక్తి మేరకు దీన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను,’ అని ఒవైసీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa