బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన తాను ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో పేదల కోసం 100 పడకల ఆసుపత్రి కట్టిస్తానని బీజేపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పీయూష్ దేశాయ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నడు నామినేషన్ వేశారు. తొలుత చిట్టినగర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్టినగర్ మీదుగా వాగుసెంటర్, సొరంగం మార్గం మీదుగా విద్యాధరపురం, నాలుగుస్థంభాల సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్ మీదుగా మోడల్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అక్కడ పశ్చిమ నియోజకవర్గం ఆర్వో రాజ్యలక్ష్మీకి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీయూష్ దేశాయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నట్లుగా సబ్‌కా సాత్.. సబ్‌కా .. వికాస్ నినాదంతో ముందుకు వెళతామన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa