తన స్ధాయికి సీఎం చంద్రబాబు నాయుడు తగడన్న స్ధాయిలో సినిమాల్లో డైలాగులు మాదిరి విమర్శలు గుప్పిస్తున్న మంచు మోహన్ బాబు బ్లాక్‌మెయిలర్ అని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మంచు ఫ్యామిలీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్న విషయం ప్రజలగమనిస్తున్నారని, పేదల కోసం పాఠశాల అన్న పెద్దమనిషి పెద్దెత్తున ఫృజురీఎంబర్సమెంటు పేరుతో భారీగా నిధులు సొంత చేసుకున్నారని, బకాయిల విషయమై అధికారుల మాట్లాడుకోవటం మాని రోడ్డెక్కడం చంద్రబాబుపైన, పార్టీ ప్రకటనలపైనా విమర్శలు చేస్తున్న మోహన్‌బాబు ఏపార్టీకి వంత పాడుతున్నారో తెలుసుకోలేని అమాయకులు ఎవరు లేరని, చంద్రబాబు గురించి మాట్లాడే ముందు మంచు కుటుంబం తమ స్థాయి ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వం, దూరదృష్టి అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ అధినేత జగన్‌కు స్పష్టమైన విజన్ లేదని, అధికారం ఇస్తే అంతా అరాచం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa