అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ ఆధికారులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా హుండీలో 1.39.6 క్యారెట్లున్న ముడి వజ్రాన్ని, ఓ ఉత్తరాన్ని గుర్తించారు. తనకు వజ్రం దొరికిందని.. నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. స్వామివారి అలంకరణ ఆభరణాల్లో వినియోగించాలని అందులో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa