ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోనే అలోవెరాతో తయారైన షాంపూ వాడండి, జుట్టు ఊడదు

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 10:45 PM

అలోవెరా.. అందరికీ అందుబాటులో ఉండే ఈ అలోవెరా అందాన్ని పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో చాలా పాపులర్. అందుకే, దీనిని ఎక్కువగా వాడతారు. అలోవెరాలోని గుణాలు జుట్టుకి ఎక్కువగా మేలు చేస్తాయి. కెమికల్ షాంపూల్ని విసిగిపోయిన జుట్టుకి అలోవెరా తిరిగి ప్రాణం పోస్తుంది. జుట్టుకి సంబంధించిన అన్నీ సమస్యలకి అలోవెరా నేచర్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. దీని కోసం మనం అలొవెరాని తీసుకుంటే అందులోని ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ విటమిన్స్ జుట్టు, స్కాల్ప్‌ని నరీష్ చేస్తుంది. ఈ కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది. పైగా ఎక్కువగా షైనీ, థిక్‌గా ఉంటుంది. ఈ అలోవెరాని మనం ఆముదం, మెంతులతో కలిపి షాంపూ తయారుచేసినప్పుడు జుట్టు సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. అంతేకాకుండా, జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది.


కావాల్సిన పదార్థాలు


అరకప్పు తాజా అలోవెరా జెల్, దీనిని తాజా కొమ్మ నుంచి తీసుకోవచ్చు.


2 టేబుల్ స్పూన్ల మైల్డ్ లిక్విడ్ సోప్(హెర్బల్ బేస్ సోప్ అయితే మంచిది)


1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు


1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె


5 నుంచి 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్(లావెండర్, టీట్రీ, రోజ్‌మెరీ)


తయారీవిధానం


ఓ బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో అందులో అలెవెరా జెల్ వేసి స్మూత్‌గా చేయాలి.


ఓ క్లీన్ బౌల్ తీసుకుని అందులో అలోవెరా జెల్, లిక్విడ్ సోప్ లేదా ఏదైనా క్లియర్ సోప్ బేస్ వేయాలి.


అందులోని కొబ్బరిపాలు, రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి.


మొత్తాన్ని ఓ సారి బాగా మిక్స్ చేయాలి. క్రీమీ టెక్చర్ వచ్చేవరకూ తిప్పండి.


దీనిని గ్లాస్ జార్ లేదా ప్లంప్ బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో వారం వరకూ స్టోర్ చేయొచ్చు.


వాడడం ఎలా


ముందుగా జుట్టుపై నీరు పోసుకోవాలి.


ఇప్పుడు అరచేతులో కాయిన్ పరిమాణంలో షాంపూ తీసుకుని చేతుల్ని రబ్ చేయాలి.


తర్వాత దీనిని జుట్టుకి రాయాలి.


2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది.


అలానే 4 నుంచి 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ టైమ్‌లో బాడీకి సోప్, స్క్రబ్ చేయొచ్చు.


ఈ షాంపూని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. మీ జుట్టుకి ఉన్న ఆయిల్‌ మొత్తం పోయేవరకూ దీనిని ఇలానే రిపీట్ చేయాలి.


షాంపూ తర్వాత నేచురల్ కండీషనర్ రాయాలి.


కండీషనర్ తర్వాత జుట్టుని కడిగి మైక్రోఫైబర్ టవల్‌తో జుట్టుని తుడవండి.


ఎన్నిసార్లు


ఇలా తయారుచేసిన అలోవెరా షాంపూని వారానికి 2 నుంచి 3 సార్లు వాడొచ్చు. రెగ్యులర్‌గా మీరు ఈ షాంపూని వాడితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా చుండ్రు తగ్గుతుంది. ఫ్రిజీనెస్ తగ్గుతుంది. జుట్టు హెల్దీగా పెరుగుతుంది. ​


మంచి రిజల్ట్స్ కోసంతాజా అలోవెరా జెల్ రాయండి. బయట కొనే జెల్స్‌లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మీ దగ్గర క్యాస్టైల్ సోప్ లేకపోతే మైల్డ్ బేబిసోప్, లేదా సోప్ బేస్ కూడా వాడొచ్చు. ఇందులో రోజ్‌మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్, టీట్రీ ఆయిల్ వాడితే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది కూడా.


బెనిఫిట్స్


అలోవెరాని జుట్టు ప్రాబ్లమ్స్‌ని దూరం చేసే హీరో అని చెప్పొచ్చు.


దీనిని రాయడం వల్ల డాండ్రఫ్, దురద తగ్గుతుంది. రెగ్యులర్‌గా వాడితే హెయిర్ రూట్స్ బలంగా మారతాయి. బ్రేకేజెస్ తగ్గుతాయి. అలోవెరా రాయడం వల్ల నేచురల్ షైన్ పెరిగి, డ్రైగా మారిన హెయిర్ సాఫ్ట్‌గా మారుతుంది. అలోవెరాలోని పోషకాలు జుట్టుని హెల్దీగా, ఒత్తుగా చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa