తమ సైనికులపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ సైన్యం చేసిన ఈ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌లో తమ సైనిక కాన్వాయ్‌పై శనివారం జరిగిన దాడికి భారతే కారణమంటూ పాక్ సైన్యం అధికారికంగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం స్పందించారు. "వజీరిస్థాన్ దాడి విషయంలో భారత్‌ను నిందిస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రకటనను చూశాం. ఆ ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa