ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన నొవాక్ జకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకోవాలని జకోవిచ్ నాలుగో రౌండ్లో 1-6, 6-4, 6-4, 6-4తో 11వ సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆరో సీడ్ జకోవిచ్ ఆరంభంలో తీవ్రంగా తడబడ్డాడు. దాంతో డిమినార్ తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత జకోవిచ్ పుంజుకుని వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకుని విజయం సాధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa