ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసత్య ప్రచారాలు చేస్తున్న 11 వేల యూట్యూబ్‌ ఛానళ్లను తొలగించిన గూగుల్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 05:04 PM

11 వేల యూట్యూబ్‌ ఛానళ్లను గూగుల్ తొలగించింది. వివిధ దేశాల అసత్య ప్రచారాలను అవి వ్యాప్తి చేస్తున్నాయని గుర్తించిన గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన వాటిలో 7,700కు పైగా చైనాకు సంబంధించినవిగా గుర్తించినట్టు గూగుల్ బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే రష్యా, ఇరాన్‌ తదితర దేశాలు కూడా ఈ ప్రచార లిస్టులో ఉన్నాయని వెల్లడించింది. అవాస్తవ సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa