తాజాగా షియోమి తన రెడ్మి సిరీస్‌లో కొత్త మోడల్‌ను మార్కెట్‌కి పరిచయం చేసింది – అదే "Redmi Note 14 SE 5G".
ఇది 2024 డిసెంబర్లో వచ్చిన రెడ్మి నోట్ 14 సిరీస్‌కు తదుపరి వర్షన్‌గా భావించవచ్చు. పలు ఫ్లాగ్షిప్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ కెమెరా మరియు దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రూ.15,000 లోపు ధరలో లభిస్తోంది. గత మోడళ్లతో పోలిస్తే మెరుగైన స్పెసిఫికేషన్లు, కొత్త లుక్‌తో వచ్చిన ఈ మోడల్ టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Redmi Note 14 SE 5G ముఖ్య స్పెసిఫికేషన్లు:
*డిస్ప్లే:6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ & 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఇది HDR10+ మరియు డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షిస్తోంది.
*ప్రాసెసర్ & పనితీరు:
ఫోన్లో MediaTek Dimensity 7025 Ultra చిప్సెట్ పనిచేస్తోంది. 6GB LPDDR4X RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో స్మూత్ మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.
*ఆపరేటింగ్ సిస్టమ్:
Android 15 ఆధారంగా HyperOS 2.0 రన్ అవుతోంది. ఇది తేలికగా, వేగంగా పనిచేసే ఇంటర్ఫేస్తో వస్తుంది.
*కెమెరా సెటప్:రియర్ కెమెరా: 50MP సోనీ LYT-600 ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్.
*ఫ్రంట్ కెమెరా: 20MP సెల్ఫీ కెమెరా. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందిస్తుంది.
*బ్యాటరీ & ఛార్జింగ్:5110mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒక గంటలోపే ఫోన్‌ను పూర్తి ఛార్జ్ చేయొచ్చు.
*సౌండ్ & ఆడియో:డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇవ్వడం గమనార్హం.
*కనెక్టివిటీ:5G, 4G, Wi-Fi, Bluetooth 5.3, GPS, IR బ్లాస్టర్, USB Type-C పోర్ట్, OTG, డ్యుయల్ నానో సిమ్‌లకు సపోర్ట్.
*డిజైన్ & కలర్స్:7.99mm మందం, 190 గ్రాముల బరువు కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కలదు.
*లభ్యమయ్యే రంగులు:
క్రిమ్సన్ రెడ్మి
స్టిక్ వైట్టై
టాన్ బ్లాక్
* ధర & లభ్యత:6GB + 128GB వేరియంట్ ధర ₹14,999గా నిర్ణయించారు. అగస్ట్ 7నుంచి Flipkart, Mi Store మరియు ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా ₹1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa