ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయం క్యూలైన్లలో చోరీలు.. సీసీ ఫుటేజ్‌చూస్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 08:02 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్న భక్తులకు ముఖ్యమైన గమనిక.. క్యూలైన్లలో వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త గ్యాంగ్ క్యూలైన్లలో చొరబడుతున్నట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలోకి వస్తారు.. అయితే ఓ గ్యాంగ్ భక్తులతో కలిసిపోతున్నాయి. భక్తుల్ని టార్గెట్ చేసి క్యూ లైన్లలో వారి మెడలోని బంగారు ఆభరణాలను, విలువైన వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. ఇటీవల చోరీలు జరగడంతో కొందరు తిరుమలలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.


తిరుమల పోలీసులు కేసులు నమోదు చేసి ఈ గ్యాంగ్ కోసం గాలించారు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగుర్ని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరు భక్తుల బంగారాన్ని దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలగా గుర్తించారు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. దొంగల దగ్గర నుంచి 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో, కొండపై భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుమల పోలీసులు. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


తిరుమలలో ఏఐ విధానంపై మాజీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. 'తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూకాంప్లెక్సు లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి లో పెట్టుకొని ఉచితంగా గూగుల్ / టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలక మండలి ముందుకు వెళ్ళుచున్న సమయంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి టిటిడి లో ఈఓగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం భాధాకరం.. శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు సామాన్యభక్తులు ఎదుర్కుంటున్న జాప్యాన్ని, ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా సాధ్యమైనంత త్వరితగతిన భక్తులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకునేలా.. ఏఐ సాంకేతికత సహకారం అందించేందుకు గూగుల్ /టిసిఎస్ తదితర ప్రముఖ సంస్థలు పనిచేస్తున్నాయి' అన్నారు.


'ఇలాంటి తరుణంలో.. భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న మీరు.. తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా.. భక్తులను గంటలు, రోజులు తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో బంధించి భక్తులు పడిగాపులు కాయడం మంచిదా..? భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ ను తీసుకురావాలని నిర్ణయించాము. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో టీటీడీ కూడా ఏఐ టెక్నాలజీ వాడడంలో ఎలాంటి తప్పు లేదు ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. పూర్తిగా ఖండిస్తున్నాను' అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa