శ్రీశైలంలో లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) మంగళవారం విశేషార్చనలను నిర్వహించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa