చీరాల ఎమ్మార్వో కార్యాలయంలో చీరాల ఆర్డీవో అధ్యక్షతన రాజకీయ పార్టీలతో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం బూత్ వారీగా శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 218 పోలింగ్ బూత్ లతో పాటు, ఓటర్ల సంఖ్యను బట్టి మరో 28 పోలింగ్ బూత్ లను అదనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై పరిశీలన జరుగుతోందని తెలియజేశారు. ఈ సమావేశంలో చీరాల ఎమ్మార్వో గోపి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa