ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీరియడ్స్ డిలే పిల్స్ వేసుకోవడం ఇంత ప్రమాదమా

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 11:08 PM

పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. అయితే..చాలా మంది దీన్ని చెడుకి సంకేతంలా చూస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇదో అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది అసలు పీరియడ్స్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


ఇటీవల ఓ 18 ఏళ్ల యువతి ఇలాగే ఇంట్లో పూజ కోసం పీరియడ్స్ డిలే అవడానికి పిల్స్ వాడింది. బ్లడ్ క్లాట్ అవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు మూడు రోజుల పాటు ఈ పిల్స్ వేసుకుంది. విపరీతంగా కాళ్లు, చేతులలో వాపులు వచ్చి చివరకు చనిపోయింది. అసలు ఈ పిల్స్ ఎలా పని చేస్తాయి. వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు వీటిని వాడడం మంచిదేనా. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.


పిల్స్ వాడుతున్నారా


చాలా మంది మహిళలు పీరియడ్స్ డిలే అవ్వడానికి పిల్స్ వాడుతుంటారు. వీటిలో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలసరి రాకుండా తాత్కాలికంగా ఆపేస్తాయి. ఎప్పుడైనా ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకలు ఉన్నప్పుడు మహిళలు వీటిని వాడుతుంటారు. ఇది కొన్ని సార్లు ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. బ్లడ్ క్లాట్స్ వచ్చే ముప్పు ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా 18 ఏళ్ల యువతి విషయంలో జరిగింది ఇదే. అసలు ఈ పిల్స్ ఎవరు పడితే వాళ్లు వేసుకోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. అంతే కాదు. వీటిపై అవగాహన చాలా తక్కువ మందికి ఉంటోంది. సహజంగా జరిగే ప్రక్రియను అడ్డుకోవడం వల్ల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుండి హార్మోన్స్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసే ముప్పు ఉంటుంది.


ఎలా పని చేస్తాయి


ఈ పిల్స్ వేసుకున్నప్పుడు బాడీలో హార్మోన్స్ లెవెల్స్ అంతా మారిపోతాయి. ముఖ్యంగా నెలసరికి ప్రేరేపించే హార్మోన్స్ ఆగిపోతాయి. ఫలితంగా పీరియడ్స్ డిలే అవుతూ వస్తాయి. ఎన్ని రోజుల పాటు మెడిసిన్ తీసుకుంటే అన్ని రోజుల పాటు పీరియడ్స్ రావు. పరీక్షలు, ప్రయాణాలు,ఇతరత్రా కారణాల వల్ల ఈ పిల్స్ వేసుకుంటారు. కానీ..ఇదో తాత్కాలిక పరిష్కరమే. అందుకోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఈ పిల్స్ వల్ల హార్మోనల్ సమస్యలు రావడంతో పాటు రక్తం పని తీరు కూడా మారిపోతుంది. ఈ మందులలో హార్మోన్స్ ఉంటాయి. నోరెతిస్టెరాన్ ఉంటుంది. ఇదే రక్తం గడ్డ కట్టుకుపోవడానికి కారణమవుతుంది. ఒక్కసారి ఈ సమస్య మొదలైంటే ఇదే ప్రాణాంతకం అవుతుంది.


ఎఫెక్ట్ ఇలా ఉంటుంది


నోరెతిస్టెరాన్ హార్మోన్ రక్త సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బ్లడ్ క్లాట్స్ వస్తాయి. అదే సమయంలో రక్తం చిక్కబడుతుంది. రక్తాన్ని పల్చగా ఉంచే ప్రొటీన్ లు తగ్గిపోతాయి. దీని వల్ల రక్తం చిక్కబడుతుంది. సరైన విధంగా సరఫరా కాక నరాల్లో గడ్డలు కడుతుంది. దీని వల్ల ప్రాణాలు కోల్పేయే ముప్పు ఉంటుంది. అయితే రక్తం గడ్డకట్టినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు విపరీతంగా వాపునకు గురవుతాయి. నొప్పి వస్తుంది. ముఖ్యంగా మడమల్లో నొప్పి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. అంతే కాదు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఈ లక్షణాలు పెరిగి చివరకు ప్రాణాలు కోల్పోతారు.


ఎవరికి ముప్పు


ఎప్పుడో ఓసారి ఈ పిల్స్ వేసుకుంటే పరవాలేదు. కానీ ఎక్కువ రోజుల పాటు వాడితే మాత్రం దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవు. అయితే..కొన్ని రకాల సమస్యలున్న వారు అసలు ఈ పిల్స్ వాడకపోవడమే మంచిదని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టడం అనేది కుటుంబంలో అంతకు ముందు ఇంకెవరికైనా జరిగి ఉంటే అలాంటి వాళ్లు అసలు ఇలాంటి పిల్స్ వేసుకోకూడదు.


ఊబకాయం ఉన్న వారు


కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. 35 ఏళ్లు పైబడిన మహిళలు వాడకపోవడం మంచిది. ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్న వారు తప్పకుండా అవాయిడ్ చేయాలి. అంతకు ముందు బ్లడ్ క్లాట్స్ సమస్య ఉన్నా వాళ్లు కూడా అసలు ఈ మందులు వాడకపోవడం మంచిది. ఎక్కువ రోజుల పాటు బెడ్ రెస్ట్ లో ఉన్న వారు, బీపీ, మైగ్రేన్ ఉన్న వారు కూడా వాడకూడదు. అయితే వైద్యులు రిఫర్ చేసిన పిల్స్ వేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చు. సొంత వైద్యం చేసుకుంటేనే సమస్యలు వస్తాయి.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి


వైద్యుల సలహా లేనిదే అసలు ఇలాంటి పిల్స్ తీసుకోకూడదని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. అలా అయితేనే ముప్పు తగ్గుతుంది. ఒకవేళ ఈ పిల్స్ తీసుకున్నా సరైన విధంగా హైడ్రేట్ అవ్వాలి. అంటే నీరు తాగాలి. ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవాలి. ఇప్పటికే క్లాటింగ్ సమస్యలున్న వారు అసలు ఈ మందులు వాడకూడదు. ఇందాక చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా లేదా అని ముందుగానే చెక్ చేసుకుని అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవ్వాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa