ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గితే శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 10:47 PM

వంధ్యత్వం ఈ మాట వినగానే స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని చాలా మంది అనుకుంటారు. అయితే, పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాల సంఖ్య), నాణ్యత తగ్గినప్పుడు ఈ పరిస్థితి తలెత్తవచ్చు. పురుషుల శుక్రకణాల స్థాయిలు పడితే.. ఇది సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. పిల్లలు కనే సామర్థ్యం తగ్గుతుంది. ప్రస్తుత బిజీ లై‌ఫ్‌స్టైల్, చెడు అలవాట్ల కారణంగా పురుషుల్లో వీర్యకణాల సంబంధిత సమస్యలు పెరగడం ప్రారంభించాయి. చాలా మంది తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి సకాలంలో తెలుసుకోకపోతే అది క్రమంగా తీవ్రమవుతుంది.


స్పెర్మ్ లేకపోవడం లేదా తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను ఎలా గుర్తించగలం అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అయితే, నిపుణుల ప్రకారం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే వంధ్యత్వ సమస్యను నివారించవచ్చు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఇందుకు కారణాలేంటి ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అంతర్గత సమస్య కూడా కారణం కావచ్చు


భాగస్వామి పరీక్షలు అన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ మీరు బిడ్డను కనడం ఇబ్బందిని ఎదుర్కొంటుంటే, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటే పిల్లలు పుట్టడం చాలా కష్టం. Mayo Clinic.org నివేదిక ప్రకారం, కొంతమంది పురుషులలో కొన్ని అంతర్గత సమస్యలు తక్కువ స్పెర్మ్ కౌంట్‌కి కారణం కావచ్చు. ఉదాహరణకు, హార్మోన్ల అసమతుల్యత లేదా స్పెర్మ్ మార్గాన్ని అడ్డుకునే ఏదైనా పరిస్థితి.


తక్కువ స్పెర్మ్ కౌంట్‌కి కారణాలు


* ప్రాసెస్ చేసిన, జంక్, ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోవడం


* సోడా డ్రింక్స్, టీ-కాఫీ మొదలైన వాటి అధిక వినియోగం.


* తగినంత నిద్ర లేకపోవడం లేదా నిద్ర సమస్యలు ఎదుర్కోవడం


* ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక పరిస్థితులు


* ధూమపానం, అధిక మద్యం సేవించడం


* శారీరక శ్రమ లేకపోవడం


* వృద్ధాప్యంతో స్పెర్మ్ కౌంట్ తగ్గడం


* జన్యులోపం


* దీర్ఘకాలిక వ్యాధుల కారణాలు


* ఏదైనా ఆపరేషన్ వల్ల


* శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం


* శరీరంలో హార్మోన్ల అసమతుల్యత


* ప్రైవేట్ భాగాలకు గాయం


* ఈ కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది.


తక్కువ స్పెర్మ్ కౌంట్ లక్షణాలు


తక్కువ స్పెర్మ్ కౌంట్ లక్షణాలు


* లైంగిక కోరిక లేదా ఆసక్తి కోల్పోవడం


* రోజంతా అలసిపోయినట్లు అనిపించడం


* అంగస్తంభన లోపం


* ముఖం, శరీరం లేదా ఇతర భాగాలపై వెంట్రుకలు తగ్గడం


* వృషణ ప్రాంతంలో నొప్పి సమస్య


* వృషణ ప్రాంతంలో వాపు లేదా ముద్ద


* రొమ్ము పరిమాణంలో అసాధారణ పెరుగుదల


* ఎక్కువ నీరసంగా ఉండటం


స్పెర్మ్ కౌంట్ సున్నా అయితే ఏం చేయాలి?


ఒక పురుషుడి వీర్య విశ్లేషణలో సున్నా అని తేలితే, అతను తన ఫ్రక్టోజ్ స్థాయిని కూడా పరీక్షించుకోవాలి. శుక్రకణాల సంఖ్య సున్నాగా ఉంటే ఈ పరిస్థితిని అజోస్పెర్మియా అంటారు. మిల్లీమీటర్ వీర్యంలో 15 మిలియన్ల కంటే తక్కువగా ఉంటే, అది లో స్పెర్మ్ కౌంట్ కిందకి వస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఒక బిడ్డను ఉత్పత్తి చేయడానికి అండాన్ని ఫలదీకరణం చేయడానికి ఒకే ఒక స్పెర్మ్ సరిపోతుందని నమ్ముతారు. అయితే, లైంగిక సంపర్కం సమయంలో లక్షలాది స్పెర్మ్‌లు స్కలనంలో విడుదలవుతాయి.


శుక్రకణాల సంఖ్యని ఎలా పెంచాలి?


శుక్రకణాల సంఖ్యను త్వరగా పెంచడానికి ఖచ్చితంగా సూచించే చికిత్స లేదు. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు. ఆయుర్వేద మూలికలు ఇందులో సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ, వాటిని సరైన పరిమాణంలో తీసుకోవాలి. ఇందుకోసం ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించడం అవసరం. వీటిలో అశ్వగంధ, శిలాజిత్ మూలికలు ఉన్నాయి. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గిచడం కోసం యోగా చేయడం భాగం చేసుకోవాలి. అంతేకాకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్ ఉండాలి. రెట్ మీట్, వేయించిన ఆహారాలు, ప్రాసెస్, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa