ఐరోపా దేశం ఫ్రాన్స్‌ను ఆందోళనలు కుదిపేస్తున్నాయి. రాజధాని పారిస్ సహా ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో బుధవారం నిరసనకారులు రహదారులపై బైఠాయించి, వాహనాలకు నిప్పటించారు. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పాలనకు వ్యతిరేకంగా మరోసారి ఫ్రాన్స్‌లో ఉద్యమం మొదలైంది. ‘అన్నీ ఆపేయాలి ( బ్లాక్ ఎవ్విరిథింగ్ )’ పేరుతో దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలకు పిలునిచ్చారు. దీంతో కొద్ది గంటల్లో దాదాపు 200 మందిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రకటించారు.
వాస్తవానికి ఈ ఉద్యమం వేసవిలోనే రహస్య చాటింగ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. ఆందోళనలను అడ్డుకోడానికి దాదాపు, 80,000 మంది పోలీసులను మెక్రాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా మోహరించింది. అయినాసరే నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. అయితే, గతంలో మెక్రాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో పోల్చితే వీటి తీవ్రత తక్కువగానే ఉంది. ఫ్రాన్స్‌లో చేపట్టిన ‘ఎల్లో వెస్ట్’ ఉదయం సంవత్సరాల తరబడి సాగింది. 2022లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెన్షన్ సంస్కరణల విషయంలో మెక్రాన్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పారిస్‌లో 2023లో ఓ టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపిన అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
సోమవారం ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరోకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన తప్పుకున్నారు. దీంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెక్రోను అధ్యక్షుడు మెక్రాన్ మంగళవారం నియమించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆకస్మిక ఆందోళనలకు నిరసకారులు పిలుపునిచ్చారు.
‘బ్లోక్వాన్ టూ’ లేదా ‘అన్నీ ఆపేయాలి’ ఉద్యమం సోషల్ మీడియాలో రహస్య చాటింగ్‌లతో మొదలైంది. నిరసనల రోజున రోడ్డుపై బైటాయించడం, సమ్మెలు, ప్రదర్శనలు, ఇతర వ్యతిరేక చర్యలకు పిలుపునిస్తుంటారు. స్పష్టమైన నాయకత్వం లేకుండానే వైరల్‌గా వ్యాప్తి చెందిన ఈ ఉద్యమం వెనుక విస్తృతమైన డిమాండ్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు రాజీనామాకు ముందు ప్రధాని బైరో మద్దతు ఇచ్చిన వివాదాస్పద బడ్జెట్ అంశాలను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే, అసమానతలపై తీవ్ర అసంతృప్తిని కూడా ఈ ఉద్యమకారులు వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ఈ ఉద్యమం ‘ఎల్లో వెస్ట్’నిరసనలను గుర్తుకుతెస్తోంది. మొదట ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ట్రాఫిక్ సర్కిళ్ల వద్ద కార్మికులు 2018లో నిరసనలు ప్రారంభించారు. పసుపు రంగు స్పష్టంగా కనిపించే జాకెట్లు వారు ధరించి నిరసన తెలిపారు. క్రమంగా ఇది ఆర్థిక అన్యాయం, మెక్రాన్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజకీయ, ప్రాంతీయ, సామాజిక, తరాల విభేదాలను దాటి ప్రజలందరికీ వ్యాపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa