రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో పరిస్థితిని వర్ణించడానికి మాటలు చాలడం లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో అధికారులు.. లంక గ్రామాల ప్రజలను ప్రమత్తం చేశారు. అలానే ప్రకాశం బ్యారేజీ నంచి కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు.
కృష్ణా నదికి భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని.. పరిసర మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కొల్లూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇబ్బందులు ఉంటే 77948 94544 నంబర్‌కి కాల్ చేయమని తెలిపారు. అలానే భట్టిప్రోలు మండలంలో మరో కంట్రోల్ రూమ్ నంబర్: 81798 86300 ప్రజలకు అదుబాటులో ఉంచారు.
అలానే గోదావరిలోకి కూడా భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాజమండ్రి వద్ద గోదారిలోకి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో.. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలానే బాసరలో గోదవారి ఉగ్రరూపం దాల్చింది. నెల రోజుల వ్యవధిలో బాసరలో రెండోసారి వరద పోటెత్తింది. గోదావరి వరద ఉధృతికి ఆ ప్రాంతంలో ఉన్న లాడ్జీలు, కాటేజీలు నీట మునిగిపోయి. గోదావరి వరదల నేపథ్యంలో దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పుష్కర ఘాట్ మునగడంతో భక్తులు స్నానాలకు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అల్ప పీడనం తీరం దాటడంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa