బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం చూస్తే — సమాధానం “అవునే” అనిపిస్తోంది. తాజా ఆసీస్ వన్డే సిరీస్‌కు షమీ పేరు జట్టు ఎంపికలో లేకపోవడం, ఆ ఊహాగానాలకు బలమిస్తోంది.భారత క్రికెట్ బోర్డు శనివారం ఆసీస్ టూర్ కోసం జట్టును అధికారికంగా ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఈ ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ షమీ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.గమనించదగ్గ విషయం ఏంటంటే, షమీ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరుపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో పాల్గొన్నప్పటికీ, ఆశించిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.ఐపీఎల్ అనంతరం షమీని ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదు. సెలక్టర్లు అప్పట్లో షమీకి పూర్తి ఫిట్‌నెస్ లేదని వెల్లడించారు. కానీ, అదే సమయంలో ఆయన డొమెస్టిక్ టోర్నమెంట్లలో, ముఖ్యంగా దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ కనిపించారు. అయితే అక్కడ కూడా షమీ రిథమ్ కోల్పోయినట్లు స్పష్టమైంది.దీంతో తాజాగా జరుగుతున్న విండీస్ టెస్టు సిరీస్‌కి షమీ ఎంపిక కాలేదు. ఇక ఆసియాకప్ 2025 జట్టులో కూడా అతడి పేరు లేకపోవడంతో, షమీ క్రికెట్ కెరీర్‌పై గుబురైన మేఘాలు కమ్ముకున్నాయి. వన్డే జట్టులో అయినా అతనికి చోటు దక్కుతుందనుకున్న ఆశలు కూడా కల్లబొసుకున్నాయి.ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ కావడంతో — ఇందులోనూ షమీకి అవకాశమివ్వకపోవడం, అతడి ఇంటర్నేషనల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారేలా చేసింది.గాయం – కెరీర్ మలుపు తిప్పిన మలుపు.గత రెండేళ్లుగా షమీ చీలమండ గాయం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన హీరోగా నిలిచిన షమీ, ఆ టోర్నీ తర్వాత చికిత్స కోసం సర్జరీ చేయించుకున్నాడు. ఆ గాయంతో దాదాపు సంవత్సరం పాటు మైదానానికి దూరమయ్యాడు.తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చోటు దక్కించుకున్నాడు. ఆ టోర్నీలోనూ షమీ పర్ఫార్మెన్స్ సగటుగానే ఉండటంతో, తాజా ఎంపికలో అతడు ఎంపిక కాకపోవడం సహజంగానే కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa