మీరు మీ డైట్‌లో ఫైబర్ శాతాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్లయితే.. చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చియా గింజల్లో గుమ్మడి గింజల కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ అధిక ఫైబర్ కారణంగా ఇవి త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. బరువు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. వీటితో పాటు చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరు. ఈ ఒమేగా-3లు మీ గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుకు కీలకం. అంతేకాక ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్లైసెమిక్ నియంత్రణ, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే వారికి చియా గింజలు చాలా మేలు చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa