ట్రెండింగ్
Epaper    English    தமிழ்

35 ఏళ్ల మహిళను పెళ్లాడి తెల్లారేసరికే చనిపోయిన 75 ఏళ్ల వృద్ధుడి కథలో షాకింగ్ ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 03:04 PM

ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా కుచ్‌ముచ్ గ్రామంలో ఇటీవల జరిగిన ఈ వివాహ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏడాది క్రితమే భార్య చనిపోయిన ఒంటరిగా జీవిస్తున్న ఓ 75 ఏళ్ల వృద్ధుడు.. తన వయసులో సగం కూడా లేని 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వివాహం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామునే ఆయన మృతి చెందారు. దీంతో అంతా పెళ్లి కూతురే అతడిని చంపిందేమోనని భావించారు. ఆస్తి, డబ్బు, నగల కోసమే ఇలా చేసిందంటూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ తాజాగా ఈయన మృతికి గల అసలు కారణం వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి రాగా.. ముసలోడు ఇంత పని చేశాడా అంటూ అంతా ముక్కున వేలేస్కుంటున్నారు.


అసలేం జరిగిందంటే?


మొదటి భార్య సంవత్సరం క్రితం చనిపోవడంతో 75 ఏళ్ల సంగ్రూమ్ ఒంటరిగా జీవిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు కూడా లేకపోవడంతో.. ఒంటరి జీవితాన్ని భారంగా గడిపిన ఆయన వివాహం చేసుకుని తోడు తెచ్చుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బంధువులు, గ్రామస్థులకు చెప్పగా వారంతా అందుకు నిరాకరించారు. అయినా అదేమీ పట్టించుకోని సంగ్రూమ్ వారి మాట వినకుండా ఆయన వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే తనలాగే ఓ ఒంటరి వృద్ధురాలినే చేసుకుంటాడని అంతా భావించినప్పటికీ.. ఆయన మాత్రం తనకంటే దాదాపు 40 ఏళ్లు చిన్నదైన మన్‌భావతి అనే 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీన జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన మన్‌భావతిని సంగ్రూమ్ ముందుగా కోర్టులో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయబద్ధంగా ఏడడుగులు వేసి వివాహ తంతు పూర్తి చేసకున్నాడు.


ఇదంతా బాగానే ఉండగా... అదే రోజు రాత్రి వీరిద్దరూ శోభనం చేసుకోవాలనుకున్నారు. ఇలా వీరిద్దరూ ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోగా.. తెల్లారేసరికే సంగ్రూమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. భయాందోళన చెందిన మన్‌భావతి వెంటనే కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇలా వారంతా కలిసి హుటాహుటిన సంగ్రూమ్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు ఈ విషాద వార్తను ధ్రువీకరించడంతో.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని ఇంటికి చేరుకున్నారు.


అయితే మన్‌భావతి డబ్బు, ఆస్తి కోసం సంగ్రూమ్‌ను పెళ్లి చేసుకుందని, రాత్రికి రాత్రే అతడిని చంపేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని బంధువులు.. పోలీసులకు వివరించగా సంగ్రూమ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈక్రమంలోనే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగ్రూమ్ ఎందుకు చనిపోయాడో ఇందులో తేలిపోవడంతో.. అంతా ఆయన భార్య తప్పు లేదని గ్రహించారు. ముఖ్యంగా పోస్టుమార్టం నివేదికలో సంగ్రూమ్ మరణానికి కారణం సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని తేల్చారు. దీని వల్లే ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు వివరించారు. ఇలా ఎందుకు జరుగుతుందని బంధువులు వైద్యులను అడగ్గా.. వారు చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు.


ముఖ్యంగా దీని గురించి జిల్లా సర్జన్ డాక్టర్ అరుణ్ సింగ్ వివరిస్తూ.. సెరెబ్రోవాస్కులర్ ప్రమాదంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. శృంగార సామర్థ్యం పెంచే మందులు తీసుకున్న తర్వాత ఆల్కహాల్ సేవించడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ మందు ప్రభావం సేవించిన ఆరు గంటల తర్వాత కనిపిస్తుందని స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో పెళ్లి చేసుకోవడంతో.. శోభనం రోజు సంగ్రూమ్ శృంగార సామర్థ్యం పెంచే మందులు తీసుకున్నారని, అయితే ఆ తర్వాత ఆల్కహాల్ కూడా సేవించాడని వివరించారు. దీని వల్లే ఆయన మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa