ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదిలో పురాతన శివలింగం, నంది విగ్రహాలు లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 02:52 PM

ప్రకాశం జిల్లా, కురిచేడు మండలం, ముష్ట్లగంగవరం సమీపంలో గుండ్లకమ్మ నది గర్భంలో పురాతన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. ఇటీవల మొంథా తుఫాను కారణంగా వచ్చిన వరద వల్ల నదిలో మట్టి కొట్టుకుపోవడంతో ఈ విగ్రహాలు కనిపించాయి. కార్తీకమాసంలో శివలింగం బయటపడటంతో గ్రామస్థులు తమ గ్రామానికి సాక్షాత్తూ శివుడే వచ్చాడని భావించి పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలు కనిపించిన చోట గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa