రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులతో సహా నిందితుల రిమాండ్‌ను కోర్టు జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది. పోలీసులు నిందితులను ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిందితులను జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, జోగి రమేష్ మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa