విద్యార్థులతో వెళ్తున్న ఓ మిని బస్సు లోయలో పడి 11 మంది విద్యార్థులు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. వివరాలలోకి వెళితే పూంచ్ జిల్లాలోని కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో ఇన్‌స్టిట్యూట్‌కు బయల్దేరిన మినీ బస్సు పీర్‌కిగలీ ప్రాంతం వద్దకు రాగానే అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. మృతుల్లో 9 మంది విద్యార్థినులు ఉన్నారు. మరో ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి.క్షతగాత్రులను షోపియాన్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద విషయం అందుకున్న జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, . మృతులకు సంతాపం తెలియజేశారు.. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రబుత్వం నుంచి అందిస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa