ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కట్టిన మొట్టమొదటి కట్టడం ఇదే: వార్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 02:04 PM

ఏపీ సీఎం వైస్ జగన్ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య వినూత్నంగా విమర్శలు చేశాడు. రోడ్డుకు అడ్డంగా కట్టిన ఓ గోడను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన... జగన్ ప్రభుత్వం వచ్చాక కట్టిన మొదటి కట్టడం ఇదేనని విమర్శించారు. తాజ్ మహల్ దేశ ప్రగతికి చిహ్నమైతే... ఈ గోడ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ప్రతీక అని ఎద్దేవా చేశారు. తాజ్ మహల్ ను అందరూ ఆస్వాదిస్తుంటే... ఈ గోడను ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారని అన్నారు. అక్రమ కట్టడమైన ఈ గోడ ప్రభుత్వ అసమర్థతను ప్రతిబింబిస్తోందని చెప్పారు. దళితుల మధ్య అగాధానికి కారణమైన ఈ గోడను పడగొట్టాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa