సయమసొంతంగా నడుపుకుంటున్న ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లకు చేయూత ఇచ్చే కార్యక్రమంఈ నెల 25 వరకు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ ఆధారంగా సాగింది. అక్టోబర్ 4వ తేదీన ఈవిషయమై ఓ సదకచేరపథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఈ విషయమై ఆఫ్ లైన్, ఆన్ లైన్ లతో పాటు నేరుగా దరఖాస్తులను స్వీకరించిన అధికారులు వీటిపై చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికేగడువు తేదీ వరకు 1,75,218 దరఖాస్తుల నమోదుకాగా 93,741 దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిసట్టు సమాచారం. ఇప్పటికే వీటి జాబితాను ఆయా జిల్లా కలెక్టర్ లకు పంపిన రవాణాశాఖ ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన గణన తేదీ నిర్ణయించింది. సొంతగా ఆటోలు, మాక్సీక్యాబ్, టాక్సీలు కొనుగోలు చేసి… వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తన పాదయాత్రలో ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం రాగానే వారి కష్టాలను గట్టెక్కిస్తానంటూ హామీ ఇచ్చిన విషయం విదితమేజ దీనిలో భాగంగా ప్రతిఏటా అర్హులైన డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక చేయూతను అందించేలా చూస్తాని వాగ్ధనం చేసారు. దానిని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టింది.
వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం పేరుతో రాష్ట్రంలోని లక్షలాధి మంది మంది అర్హులైన డ్రైవర్లకు ఏటా పదివేల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించింది.ఈనెల పద్నాలుగో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశారు
అర్హులు సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు, అలాగే ఈ- సేవ, మీ- సేవ, సీఎస్ సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో డ్రైవర్లు తమ దరఖాస్తులు అందచేశారు.
కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతం చేశారు.రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ లు వాహన మిత్ర పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరడం ద్వారా అర్హత పొందుతారు.
ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను సమర్పించాలని ముందుగానే ప్రకటించారు.అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైతే తమ కులధృవీకరణ పత్రం కూడా సమర్పించాలని సూచించారు.సమర్పించిన ఆ డాక్యుమెంట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సంరక్షణలో ఉందో లేదో పరిశీలిస్తారు.ఈ సమాచారంను, సదరు దరఖాస్తుల్ని సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, బిల్లు కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారన్నారు. తర్వాత ఆ దరఖాస్తుల్ని ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి. వీటిలో నేటి వరకు 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. అక్టోబర్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదిగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంను ప్రారంభింప చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa