హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు. ఉప్పల్ స్టేడియంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. హెచ్‌సీఏలోని 227 మంది సభ్యుల్లో 223 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ బరిలోకి దిగినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే జరిగింది. ఈ ఎన్నికల్లో అజారుద్దీన్, ప్రశాష్ చందద్ జైన్‌పై 146 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్ విజయం సాధించారు. అజారుద్దీన్ రేసులో నిలవడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. చివరకు విజయం ఆయన్నే వరించింది. అర్జున్ యాదవ్, నిజాం క్లబ్, భారతి సిమెంట్స్ ప్యానెల్ ఓటు వేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa