భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉదయం భద్రతా సిబ్బందితో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 26/11 దాడులను తామెవ్వరం మరచిపోలేదన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావన్నారు. నేవీ, కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa