కేరళలోని వెంగోల ప్రాంతంలోని తొంబర హౌజ్‌కి చెందిన అల్బిన్ మాథ్యూస్(30), నిను సుసేన్(28)లకు ఈ ఏడాది అక్టోబర్ 28న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజులకు ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.అక్కడే ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు. సునేన్ ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా.. మాథ్యూస్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ జంట ఆస్ట్రేలియాలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్నసమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు తగలబడటంతో.. దంపతులిద్దరు కారు లోపలే సజీవ దహనమయ్యారు. ఇదే క్రమంలో ఈ నెల 21న ఇద్దరు కారులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఇద్దరూ కారులోనే సజీవ దహనమయ్యారు. న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు కేరళలోని మాథ్యూస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa