గర్భిణులు అబార్షన్లు చేసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20 వారాల వరకు గర్భం ఉన్నవారు మాత్రమే అబార్షన్లు చేసుకోవడానికి వీలుంది. దానిని కేంద్ర ప్రభుత్వం 24 వారాలకు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అబార్షన్ల పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టు అవుతుందని మంత్రి అన్నారు. 5 నెలల గర్భం దాటిన వారు శారీరక ఇబ్బందులు ఎదుర్కొని అబార్షన్లు చేయించుకోవాలంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa