నేటి పంచాంగం:
వారం: ఆదివారం
ద్వాదశి ఉ.8.21
ఉత్తరాషాఢ మ.1.52
శుభసమయం: ఉదయం.8.09-8.38, సాయంత్రం.5.35-5.50
దుర్ముహూర్తము: సాయంత్రం.4.41-5.31
వర్జ్యము సాయంత్రం.6.04-7.45
రాశి- మేషం
సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
రాశి- వృషభం
ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.
రాశి- మిధునం
నిరుద్యోగుల యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది.
రాశి- కర్కాటకం
ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
రాశి- సింహం
బంధువుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.
రాశి- కన్య
ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పొకండి. మీకు తగని పనుల జోలికి వెళ్లకండి.
రాశి- తుల
ఇంటిలో శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడడం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు.
రాశి- వృశ్చికం
సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
రాశి- ధనస్సు
ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు దక్కవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వ్యయప్రయాసల నుంచి బయటపడతారు.
రాశి- మకరం
ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దానివలన మీ ప్రతిష్టకు భంగం కలుగకుండా ఉంటుంది.
రాశి- కుంభం
వ్యతిరేకులను సైతం మాటలతో ఆకట్టుకుంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలిగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
రాశి- మీనం
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. పాత బాకీలు వసూలై అవసరాలు తీరతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa