తమిళనాడులో ఎట్టకేలకు సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. సినిమా టికెట్లపై 58 శాతం పన్ను విధింపును తీవ్రంగా పరిగణిస్తూ నాలుగురోజులుగా బంద్ పాటిస్తోన్న విషయం తెలిసిందే. జీఎస్టీవల్ల సినిమా టిక్కెట్లపై కేంద్రం విధిస్తోన్న 28 శాతం పన్నే కాకుండా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం వినోద పన్ను వసూలు చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుభారం 58 శాతం పడింది. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన థియేటర్ల యజమానులు ప్రభుత్వం నుంచి ఓ హామీ రావడంతో బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో నాలు గురోజులుగా సుమారు వెయ్యి థియేటర్లు మూత పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa