బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఈ నెల 16న సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశం ఉంది. 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, అదే రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే సజావుగా పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 16న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 17న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నాడే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అధికార ఎన్డీయే తరఫున రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరాకుమార్ రాష్ట్రపతి రేస్ లో నిలిచారు. ఈ నేపథ్యంలో 16వ తేదీనే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ.. ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో ఎన్డీయే మిత్రపక్ష పార్టీల నాయకులతోనూ ప్రధాని మోదీ భేటీ అవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa