అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. తనపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బంది పట్ల దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనపై 8 ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి. మరోవైపు, ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలంటూ జేసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa