చెన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ కు మరో షాక్ తగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిమానా పడ్డ కెప్టెన్లలో మోర్గాన్ మూడోవాడు. ఇప్పటికే సీఎస్‌కే కెప్టెన్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జరిమానా బారిన పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa