మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు కార్పొరేటర్ పైనే దాడి చేశాడు ఓ యువకుడు. గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ వెంకటకృష్ణాచారి బుధవారం బ్రాడీపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు మాస్క్ లేకుండా కనిపించాడు. మాస్క్ పెట్టుకోవాలని ఆ యువకుడిని కార్పొరేటర్ మందలించాడు. ఇరువురికీ మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో యువకుడిపై సదరు కార్పొరేటర్ చేయి చేసుకున్నాడు. అయితే తనను తన తల్లిదండ్రులే కొట్టలేదు నీవు కొడతావా అంటూ తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్ పై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన కార్పొరేటర్ అనుచరులు ఆ యువకులను గుర్తించి వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa