తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ కాలేజీలో బిపిన్ రావత్ చదువుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన తర్వాత డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలోనే ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తాజాగా వెల్లింగ్టన్ అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. తాను చదువుకున్న చోటుకు వెళుతున్న క్రమంలో బిపిన్ రావత్ మృతిచెందడం విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa