బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సుగంధ నదిపై వెళ్తున్న మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగి 32 మంది సజీవ దహనం అయ్యారు. ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన చోట చేసుకుంది. నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొంత మంది ప్రాణాలను కాపాడుకునేందుకు నదిలోకి దూకగా, మంటల్లో చిక్కుకుని 32 మంది సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa