ఉద్యోగాల భర్తీకి మరో బ్యాంక్ నుండి నోటిఫికేషన్ జారీ అయింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య: 25
-జనరల్ కేటగిరీకి: 11 పోస్టులు
-ఓబీసీ : 09 పోస్టులు
-ఎస్సీ: 02 పోస్టులు
-ఎస్టీ: 02 పోస్టులు
-ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈ డబ్ల్యూఎస్):01
*దరఖాస్తు విధానం: ఆన్ లైన్
*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 07 జనవరి 2022.
*దరఖాస్తు రుసుము:
జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.175. ఈ ఫీజ్‌ను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.
*ఎంపిక విధానం:వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక *అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 5 సంవత్సరాలు అధికారిగా పని చేసిన వారు కూడా అర్హులే. వయస్సు 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
*జీతం: నెలకు రూ. 48,170 నుండి నెలకు రూ. 69,810 వరకు జీతం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఇవ్వబడతాయి.
* పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://bankofindia.co.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa