ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జాహ్నవి అనే యువతి అరుదైన ఘనత సాధించింది. అమెరికాలోని అలబామాలోని నాసా లాంచ్ ఆపరేషన్స్ కెన్నెడీ స్పేస్ సెంటర్ ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP)లో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా జాహ్నవి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పంజాబ్‌లోని ఎల్‌పీయూ యూనివర్శిటీలో రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఆమె ఐఏఏలో స్థానం కోసం దరఖాస్తు చేసుకుంది. రెండు ఇంటర్వ్యూల తర్వాత ఆమె ఈ అంతరిక్ష కార్యక్రమానికి ఎంపికైంది. జాహ్నవితో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 20 మంది ఎంపికయ్యారు. భారత్ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి జాహ్నవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa