ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) మహారాష్ట్ర సర్కిల్ లో 2021–2022 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
*మొత్తం ఖాళీల సంఖ్య: 55
*అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
*వయసు: 25ఏళ్లు మించకుండా ఉండాలి.
*స్టైపెండ్: నెలకు రూ.8000.
*ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికచేస్తారు.
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
*ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29 డిసెంబర్ 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bsnl.co.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa