భారత్ లో 15-18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి కొవిన్ యాప్/వెబ్‌సైట్ లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం 15-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఒకటే అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా కొవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
- మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీ నంబర్ ను వెరిఫై చేయాలి.
- ఒక ఫోన్ నంబర్ పై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- నంబరు వెరిఫై అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- పిల్లలకు పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి ఉండవు కాబట్టి ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నంబర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ నంబర్ లేకపోతే పదో తరగతి స్టూడెంట్ ఐడీ నంబర్ ను నమోదు చేయవచ్చు.
- ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసి వ్యాక్సినేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa