సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. జొహనెస్‌బర్గ్‌లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118/2 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి. డీన్ ఎల్గర్ (46), వాండర్ డస్సెన్ (11) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఇంకా 8 వికెట్లు పడగొట్టాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa