ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నియోకొవ్​ వైరస్' గురించి ఆసక్తికర విషయాలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 11:17 AM

ఇటీవల వెలుగు చూసిన కరోనా కొత్త వైరస్​ నియోకొవ్​​ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్​ అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని చైనా వుహాన్​ ల్యాబ్​ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే నియోకొవ్​తో భారత్​ కు ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జీనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయాలజీ శాస్త్రవేత్త వినోద్ స్కేరియా ఈ విషయాన్ని చెప్పారు.
నియోకొవ్​ కొత్త వేరియంట్​ కాదని ఆయన తెలిపారు. ఇది గబ్బిలాల నుంచి ఉద్భవించిందని తెలిపారు. అయితే దీనికి మానవులకు సోకే లక్షణం లేదని వినోద్​ పేర్కొన్నారు. జంతువుల నుంచి మానవులకు సోకే ఘటనలు చాలా అరుదని తెలిపారు. నియోకొవ్​ అనేది తొలిసారిగా నియోరోమిసియా అని పిలిచే గబ్బిలాల జాతిలో గుర్తించినట్లు తెలిపారు. దీని జన్యువు ఎంఈఆర్​ఎస్​-సీఓవీను పోలి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే అంశంపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని వినోద్​ అన్నారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa